ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ కు ఎస్పి అభినందనలు

నవతెలంగాణ – సిరిసిల్ల

సిరిసిల్లలో ఓ మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించి ప్రశంసా పత్రం అందజేశారు.సిరిసిల్ల లోని  గాంధీ నగర్ కు చెందిన చిలగాని అనూహ్య అనే మహిళా తండ్రి శంకర్  మరణ వార్త విని గుండె పోటుకు గురై కుప్పకూలగా వెంటనే కానిస్టేబుల్ గడ్డమీద శ్రీనివాస్ సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.ఈ సందర్బంగా ఎస్పీ అఖిల్ మహజన్ మాట్లాడుతూ..పోలీసు అధికారులు, సిబ్బందికి సి పి ఆర్ చికిత్స, బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి తెలుసుకుంటే విధినిర్వహణలో భాగంగా సామాన్య ప్రజలకు మెడికల్ ఎమర్జెన్సీలు సంభవించినప్పుడు సాధ్యమైనంత వరకు వారి ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టే జిల్లాలోని సిబ్బందికి , అధికారులకు మరియు  గ్రామస్థాయిలో రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీలు ఏర్పటు చేసి  వారికి కూడా  అవగాహన కల్పించడం జరిగిందన్నారు.చాలా వరకు తక్షణ సౌకర్యాలు లేక సహాయం లేకపోవడం వల్ల గుండెపోటు వివిధ ప్రమాదాల వల్ల ప్రజలు మరణిస్తున్నారని,ఇలాంటి సమయాల్లో, బాగా శిక్షణ పొందిన పోలీసు అధికారులు , సిబ్బంది , సామాన్య ప్రజలు  నిజంగా ఒక ప్రాణాన్ని రక్షించడంలో సహాయ పడగలడని దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఉన్న సిబ్బందికి, విలేజ్ కమిటీ సభ్యులకు సీపీఆర్ , ప్రథమ చికిత్స  పై శిక్షణ ఇవ్వడం జరిగిందని , ఈ శిక్షణ ఫలితమే ఒక నిండు మహిళ  ప్రాణం నిలబెట్టిందన్నారు.ఎస్పీ వెంట ఆర్.ఐ మాధుకర్ ఉన్నారు.