హైదరాబాద్: గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. ఎస్&పీ గ్లోబల్ ఇండియా 2024లో పని చేయడానికి భారతదేశపు వంద అత్యుత్తమ కంపెనీలలో 47వ స్థానంలో నిలిచింది. ఈ అచీవ్‌మెంట్ కంపెనీ టాప్ 100లో నాలుగో సంవత్సరం, దేశంలోని ప్రముఖ కంపెనీలలో టాప్ 50లో వరుసగా రెండో సంవత్సరంగా ఈ ఘనత సాధించింది. ఈ సందర్భంగా ఎస్&పీ గ్లోబల్ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్, నీలం పటేల్ మాట్లాడుతూ 2024లో పని చేయడానికి భారతదేశపు అగ్రశ్రేణి కంపెనీలలో ఒకటిగా ర్యాంక్ పొందడం సంతోషంగా ఉందన్నారు. టాప్ 50లో ఈ గౌరవప్రదమైన గుర్తింపు ఒక నిదర్శనమన్నారు. ‘పీపుల్ ఫస్ట్’ ఫిలాసఫీ దాని ప్రజల శ్రేయస్సు, అభివృద్ధిని నిర్ధారిస్తూ, శ్రద్ధ, సానుభూతితో ప్రజలను నడిపించడంపై బలమైన దృష్టిని కలిగి ఉందన్నారు. ఈ సందర్భంగా భారతదేశం, ఏపీఏసీ,ఎస్&పీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, ప్రాంతీయ పీపుల్ లీడ్ తనూజ్ గుప్తా మాట్లాడుతూ ఎస్&పీ గ్లోబల్లో గ్రేట్ ప్లేస్ టు వర్క్ నుంచి వరుసగా నాలుగో సంవత్సరం ఈ గుర్తింపును పొందడం గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ గుర్తింపు మా మిషన్‌పై దృష్టి కేంద్రీకరించడానికి ప్రజల శ్రేయస్సు, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పని చేయడానికి భారతదేశపు అత్యుత్తమ కంపెనీలలో ఒకటిగా గుర్తింపు మమ్మల్ని ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు. ఎస్&పీ గ్లోబల్ ఇండియా అహ్మదాబాద్, హైదరాబాద్, గురుగ్రామ్, బెంగళూరు, ముంబయి, నోయిడా, ఇండోర్‌లలో 14,000 మంది వ్యక్తులను కలిగి ఉందని తెలిపారు.