– వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని సూచన
– ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి
– క్రైమ్ రేటు ను తగ్గించేందుకు కృషి అవసరం
– దొంగతనాల కట్టడిపై దృష్టి పెట్టాలి
– సాయంత్రం వేళల్లో రోడ్డుపై విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ లు నిర్వహించాలి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లను ఇటీవలే ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శరత్ చంద్ర పవర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా సిబ్బంది పని తీరు, వారి సమస్యలుపై ఆరా తీశారు.సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్లోని సిబ్బంది వివరాలు, రికార్డుల నిర్వహణ,స్టేషన్ కేసుల స్థితిగతులు,పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలు, శాంతిభద్రతలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని క్రైమ్ రేటు ను మరింత తగ్గించేందుకు కృషి చేయాలని, కేసులను త్వరిత గతిన పూర్తిచేసి భాదితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని తెలిపారు. జిల్లాలో దొంగతనాల కట్టడిపై దృష్టి పెట్టాలి. సాయంత్రం వేళల్లో రోడ్డుపై విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ లు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎస్బి డి ఎస్ పి రమేష్, నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి,1 టౌన్ సీఐ లు సత్యనారాయణ, 2 టౌన్ సిఐ డేనియల్ కుమార్, ఎస్బి సి.ఐ రాఘవరావు, ఎస్సైలు నాగరాజు, సందీప్ రెడ్డి, శంకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.