నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
డయల్ 100 ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సూచించారు. శనివారండయల్ 100, సిఈఐఆర్ పోర్టల్ వినియోగం, సైబర్ హైజీన్ ల గురించి తీసుకోవల్సిన జాగ్రత్తల పై డీఎస్పీలు, సిఐలు, యస్.ఐ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలు కాపాడటంలో, త్వరితగతిన పోలీసు సిబ్బంది స్పందించడంలో డయల్ 100 పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు.
ఆపదలో ఉన్న బాధితులు పోలీసుల సహాయం కోసం డయల్ 100 కి ఫోన్ చేస్తే తక్షణమే స్పందించి, క్షేత్ర స్థాయిలో స్పందించాలని సూచించారు. ప్రజలకు సమర్ధవంతమైన సేవలు అందిస్తే పోలీసులపై బాధితులకు నమ్మకం పెరుగుతుందని తెలియజేశారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ లో ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసి, సమర్ధవంతంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. గత సంవత్సరం పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1470 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని, ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ www.ceir.gov.in నందు బ్లాక్ చేసి, సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ హైజీన్ – సైబర్ హ్యాకర్లు బారిన పడకుండా మొబైల్ ఫోన్లు,కంప్యూటర్లు, ఇతర పరికరాలు హ్యక్ కాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలో భాగంగా వారి పరికరాలకు ప్రత్యేకమైన బలమైన పాస్ వర్డ్స్ పెట్టుకొవాలని, తరుచూ వాటిని మారుస్తూ ఉండాలి అన్నారు. సిస్టమ్ లో యాంటి వైరస్ లాంటి వాటిని ఇంస్టాల్ చేయడం, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.ఇలాంటివి చేయడం ద్వారా సైబర్ హైజీన్ కాకుండా ఉపయోగించని యాప్ లను ఎప్పటికప్పుడు డిలీట్ చెయ్యడం ద్వారా హ్యాకర్స్ కి డేటా హ్యాక్ చేయడం కష్టతరం అవుతుందని అన్నారు. అలాగే పోలీసు అధికారులకు పోలీసు స్టేషన్లో ఉపయోగిస్తున్న కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా సైబర్ హైజీన్ గైడ్ లైన్స్ ప్రకారం పాటిస్తూ సైబర్ హ్యాకర్లు బారిన పడకుండా ఉండాలని సూచించారు.