కౌలాస్ కోటను సందర్శించిన ఎస్ పి. సింధు శర్మ 

– అద్భుత మైన కట్టడాలు..
నవతెలంగాణ –  జుక్కల్
జుక్కల్ మండలంలోని  కౌలాస్. గ్రామంలో ని  కోట అందాలు, కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని కామారెడ్డి జిల్లా ఎస్ పి. సింధు శర్మ అన్నారు. ఆమె ఆదివారం కౌలాస్ కోటను కోటకు సంబంధించిన రాజ కుటుంబీకురాలు రాని అనిత సింగ్ తో కలిసి సందర్శించారు. కౌలాస్ కోటలోని ఎల్లమ్మ తల్లి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు ఎస్పీ సింధు శర్మ నిర్వహించారు. అనంతరం కోటలో మూడు గంటల పాటు తిరిగి పురాతన నిర్మాణాలు. మందిరాలను, కట్టడాలను పరిశీంచారు. కౌలాస్ కోట చారిత్రక వివరాలు, కౌలాస్ గ్రామ చరిత్రను అక్కడి గ్రామస్తుడు బోడ సాయిలు ఎస్. పి గారికి వివరించారు. కోటలో మూడు గంటల పాటు కలియ తిరిగి తొమ్మిది గజాల ఫిరంగి,  హనుమాన్, మందిరం, రామాలయం, సరస్వతి మాత, వెంకటేశ్వరా మందిరం,పట్టే మంచం, తామర కొలను, మల్లికా బురుజు, ఆయుధ గారాలు, ధన్యగారాలు, కంధకాలు, తదితర వాటిని పరిశీలించారు.కోట వెలుపల ఉన్న అష్ట భుజ మాత మందిరాన్ని సందర్శించి పూజలు చేసి తీర్త ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమం లో ట్రైనీ ఐ పి ఎస్. లు, బాన్స్  వాడ, ఎల్లారెడ్డి డి ఎస్ పి లు, బిచ్కుంద సీఐ తో పాటు కౌలాస్ గ్రామ నాయకులు అనిత సింగ్, పాకాల వెంకటి, చిన్న హన్మగౌడ్, తదితరులు పాల్గొన్నారు.