టెక్నో నుంచి స్పార్క్‌ గో2024 స్మార్ట్‌ఫోన్‌

టెక్నో నుంచి స్పార్క్‌ గో2024 స్మార్ట్‌ఫోన్‌న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ టెక్నో కొత్తగా స్పార్క్‌ గో 2024ను విడుదల చేసింది. దీని ధరను రూ.6,699గా నిర్ణయించింది. రూ.7వేల లోపులో 3జిబి ర్యామ్‌, 64 జిబి మెమోరీతో దీన్ని ఆవిష్కరించామని టెక్నో మొబైల్‌ ఇండియా సిఇఒ అరిజీత్‌ తాలపత్ర పేర్కొన్నారు. 6.56 అంగుళాల డాట్‌ ఇన్‌ డిస్‌ప్లే కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తున్నామన్నారు.