నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ పట్టణంలోని నాలుగో వార్డ్ మహాలక్ష్మి వీధిలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు అంటుకొని పశుగ్రాసం దగ్ధమైన ఘటన బుధవారం చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మహాలక్ష్మి వీధికి చెందిన పిల్లి నరసయ్య అనే రైతుకు చెందిన వరిగడ్డి కట్టల పైన విద్యుత్తు నిప్పురవ్వలు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పశువుల మేతకు ఉంచిన వరిగడ్డి కట్టలు దగ్ధమైందని రైతు నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే విద్యుత్ శాఖ అధికారులు కరెంటు తీగలను సరి చేశారు నష్టపోయిన రైతుకు విద్యుత్ శాఖ న్యాయం చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు.