రైతులకు అవసరమైన స్పీక్ డీఏపీ కరువు..

నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండల రైతులు అత్యధికంగా నమ్మకంగా పంట సాగు కోసం  స్పీక్ డి ఏ పి మందులనే వాడుతారు అలాంటి మందు మద్నూర్ మండలంలో కరువైంది వానాకాలం పంట సాగు కోసం మండల రైతులు విత్తనాల కోసం ఎరువుల కోసం ప్రైవేటుపరంగా కొనుగోలు చేస్తున్నారు. ఫర్టిలైజర్ ఫెస్టిలైజర్ సీడ్ అమ్మకందారులు రైతులు కోరుకుని స్పీక్ డి ఏ పి లేదనే చెప్తున్నారు. ఏదేదో కంపెనీలు అలాంటి డిఏపీలు ఉన్నట్లు చెప్పడం అలాంటి కొత్త రకం మందులను రైతులు కొనాలంటే ఆసక్తి చూపకపోయినప్పటికీ దిక్కుతోచని స్థితిలో కొత్తరకం డిఎపి మందులను కొనుగోలు చేయవలసి వస్తుంది. ఈ మండల రైతులు డీఏపీ అంటే స్పీక్ పైనే నమ్మకంగా వాడుతారు అలాంటి మందు కరువైంది. ఈ విషయాన్ని నవ తెలంగాణ మండల వ్యవసాయ అధికారికి వివరణ కోరగా పైన కొరత ఉన్నట్లు లభించడం లేదని సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ఎందుకు ఇంత స్పీక్ డిఏపి కొడతా ఉంటుందని అడుగుతే పైనుండే రావడంలేదని రైతుల కోరిక మేరకు స్పీక్ డిఏపి దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి తెలిపారు.