ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలే బీఆర్ఎస్ ను గెలిపిస్తాయి

– ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ- జమ్మికుంట :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులే బీఆర్ఎస్ పార్టీని మంచి మెజారిటీతో గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగిందన్నారు. కార్యకర్తలు అందరూ సమిష్టిగా అంకితభావంతో పార్టీ గెలుపు కొరకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్ పర్సన్  దేశిని స్వప్న కోటి కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.