– ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ జమ్మికుంట:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్దే రాబోయే శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్ లో బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం జమ్మికుంట మండలం లోని కోరపల్లి ,వెంకటేశ్వర్లపల్లి , బిజిగిరీషరీఫ్, నాగంపేట్ గ్రామాలలో పాల్గొని వారికి భరోసా కల్పిస్తూ ఇంటింటికి తిరిగి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థించారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో అందరం ఐక్యంగా ఉండి, కష్టపడి పనిచేసి బీ ఆర్ ఎస్ పార్టీని గెలిపించి, సీఎం కేసీఆర్ కానుకగా ఇద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండలం ఎంపీపీ మమత, జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ ఆయా గ్రామాల సర్పంచులు చందుపట్ల స్వాతి కృష్ణారెడ్డి, రాచపల్లి సదయ్య, రమ, బోయిని రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.