– పంటల పరిశీలన అధికారుల సూచనలు పాటించండి
– మండల వ్యవసాయ అధికారి రాజు
నవతెలంగాణ మద్నూర్: ఉమ్మడి మద్నూర్ మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలో నష్టపోతున్న పంటల పట్ల వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సాధిస్తూ పంటలను పరిశీలిస్తున్నారు. బుధవారం నాడు ఉమ్మడి మండల వ్యవసాయ అధికారి రాజు రెండు మండలాల పరిధిలో శనగ పంట తదితర పంటలను పరిశీలించారు నివారణ కోసం శనగ పంట ఎర్ర తెగుళ్ల నివారణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వ్యవసాయ అధికారి ఆయా మండలాల వ్యవసాయ రైతులకు సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ రైతులతో మాట్లాడుతూ నష్టాలకు గురయ్యే పంటలకు రక్షించుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. పంటల పరిశీలన కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు ఈరోజు మద్నూర్, డోన్గ్లీ మండలాల్లో మండల వ్యవసాయ అధికారి రాజు క్షేత్రస్థాయిలో సాగు అవుతున్న, మినుము శెనగ,కంది పంటలను పరిశీలించి రైతులకు తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.