నవతెలంగాణ – భీంగల్
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నర్సరీ ల లోని మొక్కల సంరక్షణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ సూచించారు. గురువారం మండలంలోని దేవనపల్లి, పల్లికొండ , బాచన్ పల్లి గ్రామాలలోని నర్సరీలను వర్మి కంపోస్ట్ షెడ్యూలను ఏపీ ఓ నర్సయ్యతో కలిసి పరిశీలించారు. వేసవికాలంలో మొక్కలను ఎండ వేడి నుండి కాపాడేందుకు మొక్కలకు రెండు పూటల నీటిని పోయాలని గ్రామపంచాయతీ సిబ్బందికి ఎంపీడీవో తెలియజేశారు. అలాగే గ్రామాలలో పారిశుద్ధ్య పనులతో పాటు 100% పన్నుల వసూళ్లకు స్పెషల్ నిర్వహించాలన్నారు. ఈయన వెంట పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.