నవతెలంగాణ – బెజ్జంకి
ఇంటర్ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఐఈఓ రవీందర్ రెడ్డి భోధన సిబ్బందికి సూచించారు.బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈఓ రవీందర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులను పరశీలించారు.పలు రికార్డులను తనిఖీలు నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు.రానున్న ఇంటర్ పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేల భోధన సిబ్బంది కృషి చేయాలని తెలిపారు.ప్రిన్సిపాల్ దేవ స్వామి,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి,అధ్యాపకులు పాల్గొన్నారు.