
కార్యదర్శులు అదుబాటులో ఉండి మండలంలోని ప్రతి గ్రామంలో స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓ ఉమా దేవి అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ని సమావేశ మందిరంలో స్వచ్ఛదనం- పచ్చదనంపై పంచాయతీ కార్యదర్శు లు, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్చ దనం-పచ్చదనం కింద గ్రామాలలో పారిశుధ్య, తాగు నీటి సరఫరా, ఇంకుడు గుంతల నిర్మాణం, మురికి కాల్వలను, నీటి నిల్వ ప్రాంతా లను శుభ్రం చేయడం, గుంతలను పూడ్చడం, సీజనల్ వ్యాధుల నియంత్రణపై అవగాహన, వీధి కుక్కల దాడుల నివారణ చర్యలు,శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలని అన్నారు.గ్రామాలకు, పట్టణాలకు వచ్చే దారుల వెంబడి ప్లాస్టిక్ చెత్త కనిపించవద్దన్నారు. గ్రామాలలో ఉన్న మల్టీ పర్పస్ వర్కర్లను వినియోగించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామాల్లో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డు లను వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.గ్రామాల్లో గుంతల రోడ్లను పూడ్చి వేయాలని, అవసరమైన రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేయాలని,నీరు నిల్వ ఉండకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేయాలని, అదేవిధంగా మురికి కాలువలో, అధికంగా ఉన్న ప్రాంతాలలో దోమలు రాకుండా ఆయిల్ బాల్స్ వేయాలని సూచించారు. అనంతరం జిల్లా ఉత్తమ ఫీల్డ్ అసిస్టెంట్ అవార్డును జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా అందుకున్న చలకుర్తి ఫీల్డ్ అసిస్టెంట్ రమావత్ రాము నాయక్ ను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుధీర్, కార్యదర్శులు, ఉపాధి హమీ సిబ్బంది పాల్గొన్నారు.