త్రాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

– మండల ప్రత్యేక అధికారి దేవేందర్ రావు
నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ కె దేవేందర్ రావు  ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో త్రాగునీటి సరఫరా పై సమీక్ష సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రానున్న వేసవి కాలంలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా గ్రామాలలో ప్రత్యేక శ్రద్ధ వహించి త్రాగునీటిని వృధా చేయకుండా గ్రామాలలో గ్రామ ప్రజలకు తగిన సూచనలు చేపట్టాలని ఆయన ప్రత్యేక అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మండల తహసిల్దార్ అనుపమ రావు మరియు అన్ని గ్రామాల ప్రత్యేక అధికారులు అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.