– ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్: ఏఈ విజయకష్ణ
నవతెలంగాణ-పినపాక
ప్రస్తుతం వేసవిని దష్టిలో ఉంచుకొని అన్ని గ్రామ పంచాయతీలలో తాగునీటి సమస్యపై ప్రత్యేక దష్టి సారించాలని, అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు సూచించారు. శనివారం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విజయకష్ణతో కలిసి పినపాక మండలం జగ్గారం, వెంకటరావుపేట, పాండురంగాపురం, దుగినేపల్లి, ఈ. బయ్యారం గ్రామపంచాయతీలలో ఆయన పర్యటించారు. గ్రామస్తుల నుండి తాగునీటి సమస్య వస్తుందని ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించాలని సెక్రటరీలకు సూచించారు. దుగినేపల్లి బ్రిడ్జి గుంపు ప్రాంతంలో, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలో తాగునీటి సమస్య ఉందని గ్రామస్తులు తెలపగానే వెంటనే స్పందించి ఆ ప్రాంతానికి వెళ్లారు. సమస్య ఉందని తెలిపిన స్పందించని గ్రామపంచాయతీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యపై వెంటనే స్పందించాలన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతంలో ప్రజలతో మాట్లాడి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కచ్చితంగా తాగునీరు అందించే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. పాండురంగాపురం గ్రామపంచాయతీలో వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించారు. జగ్గారం, ఈ బయ్యారం గ్రామపంచాయతీ పోతిరెడ్డిపల్లి, రాయిగూడెం గ్రామాలలో రెండు రోజుల్లో తాగునీటి సమస్య తీరుస్తామన్నారు. ప్రభుత్వ అధికారులు ఉన్నది ప్రజలకు పని చేయడానికి, ప్రజా సమస్యలు తీర్చడానికే అన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే నేరుగా సెక్రటరీలకు గాని తనకుగాని తెలపాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం 23 గ్రామ పంచాయతీలలో తాగునీటి సమస్య లేకుండా చూస్తున్నామని తెలియజేశారు. ఆఫీసులో కూర్చుని పని చేసే అధికారిని చూసాము కానీ స్వయంగా రోడ్లపై తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకొని తీర్చే అధికారిని చూస్తున్నామంటూ ప్రజలు ఎంపీను కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీలు జైపాల్‌రెడ్డి, చంద్రకుమార్, అనూష, నాగిని, గ్రామస్తులు ఈశ్వర్, బోడ రమేష్, తదితరులు పాల్గొన్నారు.