నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో శనివారం నాడు ఆ పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ చదువుల పట్ల అవకాశాల గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లక్ష్మీబాయి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ యాదవ్ రావు మరో ఉపాధ్యాయులు అభిలాష్ పాల్గొన్న సదస్సులో ప్రధానోపాధ్యాయులు ప్రైవేట్ చదువులు ఎలా ఉంటాయి. ప్రభుత్వ చదువుల పట్ల అవకాశాలు ఎలా ఉంటాయి అనే దానిపై ప్రత్యేకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.