
శంకరపట్నం మండల మండల పరిధిలోని పలు గ్రామాలలో పంట రుణం తీసుకొని మరియు రేషన్ కార్డు లేని రైతులకు మీ గ్రామాలలోనే ఈనెల 29 నుండి సెప్టెంబర్ 11 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని వ్యవసాయ అధికారి వెంకటేష్, బుధవారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29న కాచాపూర్, రాజాపూర్, 30న కన్నాపూర్, ధర్మారం, 31న గద్దపాక,కల్వల, సెప్టెంబర్ 2న తాడికల్, చింతగుట్ట,3 న ముత్తారం, మక్త,4న మొలంగూర్, అముదాలపల్లి,5న ఎర్రడపల్లి,అర్కండ్ల,6న చింతలపల్లి,గొల్లపల్లి,కొత్తగట్టు,9న మెట్టుపల్లి, లింగాపూర్,10న లింగాపూర్,ఇప్పలపల్లి,అంబాల్ పూర్,11న వంకాయగూడెం,కేశవపట్నం, గ్రామాల్లో రైతుల వివరాలను ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నారు. రైతులు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు,బ్యాంక్ లోన్ స్టేట్ మెంట్, పట్టాదారు పాసుపుస్తకం,మరియు ద్రువీకరణ పత్రం, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం తీసుకొని సంబందిత గ్రామాల్లో అందుబాటులో ఉండాలని ఏవో వెంకటేష్ తెలిపారు.