
నిజామాబాదు పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వు మేరకు అటెన్షన్ డైవర్షన్ కేసులు అవుతునందున మంగళవారం సాయంత్రం నిజామాబాదు ఎసీపీ ఎం.కిరణ్ కుమార్ అద్వర్యంలో డిచ్ పల్లి మండలం కేంద్రంలోని జాతీయ రహదారి 44 ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కే మల్లేష్, ఎస్సై యూ మహేష్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించి నంబర్ ప్లేట్ లేని 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలకు తప్పని సరిగా నంబర్ ప్లేట్ ఉంచి బైక్ లను నడపాలని లేకపోతే కఠినం చర్య తీసుకుంటామని హెచ్చరించారు.పట్టుబడిన వాహనాలకు పోలిస్ స్టేషన్ తరలించారు.