రాష్ట్ర ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ ఆదేశాల మేరకు ఈనెల 16 నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి హిమశ్రీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ డ్రైవ్ లో భాగంగా జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించి తయారీ ముడిసరుకు రవాణాను తయారీదారులపై సరఫరా దాడులపై కేసులు నమోదు చేసి బైండోవర్ నిబంధనలకు ఉల్లంఘన వారిపై చట్టరిత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దేశిదారు రవాణా విషయంలో ఇలాగే కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించి ఈ డ్రైవ్ ను పకడ్బందీ అమలు చేస్తామని పేర్కొన్నారు.