పల్లెల్లో పరిశుభ్రతపై స్పెషల్ డ్రైవ్

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రంలో నూతనంగా గ్రామాలలో స్పెషల్ అధికారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. స్పెషల్ అధికారి బుధవారం బాధ్యతలు చేపడుతూ..ఉప్పునుంతల మండల కేంద్రం, జప్తిసదగోడు గ్రామాలలో ఎంపీడీవో బాధ్యతలు స్వీకరించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతనంగా నియమించబడ్డ స్పెషల్ అధికారికి ఎంపీడీవో లక్ష్మన్ రావు ను గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. ఎంపీడీవో తో పాటు జడ్పిటిసి అనంత ప్రతాపరెడ్డి, మండల ఎంపీపీ తిప్పర్తి అరుణ నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, గ్రామ పెద్దలు, యూత్ అధ్యక్షులు, పంచాయతీ సెక్రెటరీ, మల్టీపర్పస్ వర్కర్స్ తో పాటు చీపురు పట్టి రోడ్లు పరిశుభ్రతే లక్ష్యంగా వీధి వాడలో పరిశుభ్రత వైపు అడుగులు వేస్తూ శానిటైజర్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.