భవిత కేంద్రంలో ప్రత్యేక విద్యతోపాటు వ్యాయామ పరీక్షలు

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని భవిత దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలల్లో పరిసర గ్రామాల దివ్యాంగులైన నరాల బలహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు ప్రతి వారము వ్యాయామ పరీక్షలు నిర్వహిస్తామని, ప్రత్యేక ఉపాధ్యాయులు పెంటయ్య, సాయన్న లు తెలిపారు. క్యాంపులో మొత్తం ఎనిమిది మంది దివ్యాంగులు హాజరయ్యారు. ఇందులో భాగంగా డాక్టర్ సారిక వ్యాయామం చేశారు. దివ్యాంగులకు తల్లిదండ్రులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయించాలని డాక్టర్ తెలిపారు.