గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక కృషి..

– మండల పార్టీ అధ్యక్షులు బసవరాజ్ పటేల్
నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బసవరాజ్ పటేల్ తెలిపారు. మంగళవారం నాడు డోంగ్లీ మండలంలోని మొఘ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మికాంతారావు  ఆదేశాల మేరకు మంజూరు చేసిన రూ.5 లక్షల నిధులతో సీ.సీ రోడ్డు నిర్మాణానికి మండల పార్టీ అధ్యక్షులు శంకుస్థాపన చేశారు. ఈ సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డోంగ్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ శివాజీ పటేల్, పార్టీ కి చెందిన మండల నాయకులు, మొఘ గ్రామ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.