– తాండూర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్
నవతెలంగాణ-తాండూర్
సింగరేణి ఆస్తులకు సంబంధించిన స్క్రాపు దొంగతనాలపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు తాండూర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్ తెలిపారు. ఆదివారం రేచీని గ్రామపంచాయతీలోని బారేపల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమంలో సింగరేణి ఆస్తులకు సంబంధించిన ఇనుము, తుక్కు, స్క్రాపు దొంగతనాలకు సంబంధించిన ఫిర్యాదుల నమోదవుతున్న నేపథ్యంలో దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మండలంలోని బోయపల్లి బోర్డు, తాండూర్ కాపు వాడ, రాజీవ్ నగర్ పంచాయితీ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అనునిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో అనుమానిత వ్యక్తుల కదలికలను పసి కడుతున్నట్లు తెలిపారు. వ్యాపారస్తులు ముందస్తు జాగ్రత్తగా ప్రధాన కూడళ్ల వద్ద గృహ సముదాయాల ఎదుట వ్యాపార సముదాయాల ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. దుకాణం ఎదుట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న యజమాని జనార్ధన్‌ను తమ పోలీసు శాఖ తరపున అభినందించారు.