– పాలసీ బజార్ డైరెక్టర్ ప్రవీణ్ చౌదరి
హైదరాబాద్ : దక్షిణ భారత దేశంపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు ప్రముఖ బీమా ప్లాట్‌ఫారమ్ పాలసీ ీబజార్ డైరెక్టర్ సజ్ఞా ప్రవీణ్ చౌదరి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో బీమా రంగం వృద్ధి, ప్రాధాన్యతలను వివరించారు. టర్మ్, వైద్య, సేవింగ్ ప్లాన్లలో ఏడాదికేడాదితో పోల్చితే 10 శాతం పెరుగుదల ఉంటుందన్నారు. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు లేదా రూ. 25 లక్షలు యులిప్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో వినియోగ దారులు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.