బాసర భద్రతకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయాలి

నవతెలంగాణ -ముధోల్ : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం కు ప్రత్యేక పోలిస్ బెటాలియన్ ఏర్పాటు చేయాలని వాదన తెరమీదికి వచ్చింది. గత రెండు రోజులు క్రితం బాసర ఆలయంలో దొంగతనం జరిగిన ఘటన చోటుచేసుకుంది. నిఘా లేకపోవడం తోతరుచుఏదోఓక్కసంఘటనజరుగుతుంది. దీంతో ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందని భక్తులు పేర్కొంటున్నారు.ప్రతి రోజు ఆలయ భద్రతకు దేవస్థానం ఆధ్వర్యంలో హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే భద్రత విషయంలో కఠినంగా ఉండటం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం బాసర పోలీసులు వసంత పంచమి,తో పాటు,పలు ముఖ్యమైన పండుగలకు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భారీ పోలీసు బందోబస్తు నిర్వహింస్తారు. దీంతో ఏలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా పోలీసులు విధులు నిర్వహింస్తారు. అంతవరకు బాగానే ఉంది.అయితే ప్రతి రోజు దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ భద్రత కోసం హోంగార్డులు విధులు నిర్వహింస్తారు. దీంతో భద్రత విషయంలో పలు సందర్భాల్లో రాజీ పడతారన్న అపవాదు లేకపోలేదు. బాసరలో  పుణ్యక్షేత్రం, రేల్వేస్టేషన్, ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీ లు , ఉన్నాయి.వీటీకి వచ్చే , విఐపిలు, ప్రోటోకాల్ బాధ్యతలు స్థానిక పోలీసులు నిర్వహింస్తున్నారు. అంతేకాకుండా ట్రిపుల్ ఐటి లో సమస్యలు పై విధ్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వీటిని అదుపు చేయడానికి పోలీసులు కోన్ని సమయంలో  అధిక సమయం కేటాయింస్తున్నారు. దీనికి తోడు సరిపడే పోలిస్ సిబ్బంది లేకపోవడం కూడా ప్రదాన సమస్య గా మారింది .ఇన్ని సవాళ్ళ మద్య పోలిసులు తమ  విధులు నిర్వహిస్తున్నారు. బాసర  ఆలయ భద్రత పై  ప్రత్యేక దృష్టి సారించంటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆలయ భద్రత కు ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ఘటనలుజరగవనిపలువురుఅభిప్రాయపడుతున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాసర ఆలయ భద్రత కు ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.