కేమ్రాజ్ కల్లాలీ లో ప్రత్యేక గ్రామ సభ..

Special Gram Sabha in Kemraj Kallali..నవతెలంగా – జుక్కల్

మండలంలోని కేమ్రాజ్ కల్లాలీ లో  జీపీ గ్రామములో  గ్రామ ప్రత్యేక అధికారీ ప్రవీణ్  అద్యక్షతన స్పేషల్ గ్రామ సభ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమములో ఎంపీవో రాము పాల్గోన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తు లతో ఏర్పాటు చేసిన కార్యక్రమములో  మాట్లాడుతు. సీజనల్ వ్యాదులు వ్యాప్తీ జర్గ కుండా గ్రామాలలో ప్రత్యేక డ్రైైవ్ నిర్వహించాలని, శానీటేషన్ నిర్వహించాలని, త్రాగు నీటీ ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రం చేయాలని, జ్వారాలు వస్తే వెంటన్ వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని , ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలలో నీరు నల్వ కుండా చూడాలని ,లేకుంటే దోమలు లార్వ ను వదిలి బెడదతో రోగాల బారిన పడుతారని పేర్కోన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో, జీపీ సెక్రట్రి , మహిళలు, యువకులు, ఆశాలు , అంగన్ వాడీలు తదితరులు పాల్గోన్నారు.