స్పెషల్‌ కరాచీ మెహందీ కోన్‌ నిల్వలు సీజ్‌ : డీసీఏ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌ మెహిదీపట్నంలో షకీల్‌ ఇండిస్టీస్‌ తయారు చేస్తున్న స్పెషల్‌ కరాచీ మెహందీ కోన్‌ నిల్వలను డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ అధికారులు సీజ్‌ చేశారు. షకీల్‌ ఇండిస్టీస్‌ తయారు చేస్తున్న దానిలో హానికరమైన రసాయనం పిక్రామిక్‌ యాసిడ్‌ను వాడుతున్నట్టు డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ చేసిన టెస్టుల్లో తేలిన నేపథ్యంలో షకీల్‌ ఇండిస్టీస్‌పై అధికారులు దాడి చేశారు. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ప్రకారం మెహందీలో సింథటిక్‌ రంగులను ఉపయోగించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా కల్తీ చేస్తూ, లైసెన్స్‌ లేకుండా తయారీ కేంద్రాన్ని నడిపిస్తుండటంతో నిల్వలను సీజ్‌ చేసినట్టు డీసీఏ డీజీ వీ.బీ.కమలాసన్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.