ఏర్గట్ల, తాళ్ళ రాంపూర్ పీఏసీఎస్ లలో రైతుబంధుపై ప్రత్యేక మహాజన సభ..

నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల, తాళ్ళ రాంపూర్ పీఏసీఎస్ లలో సంఘ అధ్యక్షులు బర్మ చిన్న నర్సయ్య,పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన రైతు బంధు పథకంపై రైతుల సలహాలు, సూచనల కోసం ప్రత్యేక మహాజన సభా సమావేశం జరిగింది.రైతుకు ఎంత భూమి ఉన్నా, సాగుచేస్తున్న 10 ఎకరాల లోపే రైతు బంధు ఇవ్వాలని రైతులందరు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్టార్ పాపయ్య,సంఘ వైస్ చైర్మన్లు సిగసారం గంగారాం, జి.కె శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, ఏఈఓ లు సాయి సచిన్, శివాణి, సంఘ డైరెక్టర్లు పాల్గొన్నారు.