సింగిల్ విండోలలో ప్రత్యేక మహాజనసభ..

– రైతుబంధు అమలుపై రైతుల అభిప్రాయ సేకరణ
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని ఆర్గుల్ బ్రాహ్మణపల్లి సింగిల్ విండోలలో ప్రత్యేక మహాజనసభ లు సోమవారం నిర్వహించారు. బ్రాహ్మణపల్లి,  అర్గుల్ సొసైటీల ఆధ్వర్యంలో రైతు బంధు అమలుపై రైతుల అభిప్రాయ సేకరణ  కొరకు ప్రత్యేక మహాజన సభలు నిర్వహించారు. ఇట్టి సమావేశంలో జిల్లా సహకార అధికారి  శ్రీనివాసరావ్,  క్లస్టర్ ఆఫీసర్ పోషన్న, ఆడిట్ అధికారి రమేష్ రావ్, మా నిటర్ అధికారి ఆనంద్, మండల వ్యవసాయ అధికారి దేవిక   సొసైటీ అధ్యక్షులు  ఆర్మూర్గంగారెడ్డి, ఉపాధ్యక్షులు అప్పాల నడిపి రాజన్న, రైతులు, పాలకవర్గ సభ్యులు, సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.