నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం తెలిపారు. పలు కాలనీలో తాగునీటి సమస్య ఉండడంతో ఈ విషయంపై స్పందించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ గురువారం రోజు రాత్రి రెండు బోర్లు ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు షాహిద్ పాషా. కాంగ్రెస్ నాయకులు సుధాకర్. గులాం హుస్సేన్ .శేఖర్ .విక్రమ్. ఇమామ్. నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.