
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంపద వనాల మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీ శాఖ అధికారి రామ్మోహన్ అన్నారు. మంగళవారం మండలంలోని చలకుర్తి గ్రామంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ టెన్నెల్ సమీపంలో 13 ఎకరాలు విస్తీర్ణం లో ఏర్పాటు చేసిన సంపద వనాలను క్లస్టర్ ఏపీడి బాలకృష్ణ తో కలిసిఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్బంగా సంపద వనాలను తిరిగి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సంపద వనాలు ఏపుగా పెరుగుతున్నాయని వాటికోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పచ్చదనం, స్వచ్ఛదనం తో గ్రామాలకు కొత్తశోభ తీసుకొచ్చాయన్నారు.ప్రతి ఒక్కరిని అకర్శించే విదంగా సంపద వనాలు బాగా అభివృద్ధి చేయాలని తెలిపారు.వీరి వెంట ఎంపీడీఓ ఉమాదేవి, జిల్లా ఫారెస్ట్ సెక్షన్ అధికారులు మధుసూదన్ రెడ్డి, మమతబాయి, ప్లాంటేషన్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి, ఏపీఓ వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఉడుతూరి రవీందర్ రెడ్డి, ఏఈఓ రాము, అంజి, మహేష్,తుమ్మల పల్లి వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.