
నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంపీపీ గాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో గల కురుమ గల్లి, బీసీ కాలనీలో బోరు మోటర్లు బిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సహకారంతో నీటి సమస్య పరిష్కరించడం జరుగుతుందని, వేసవికాలంలో నీటి సమస్య రాకుండా ఇప్పటినుండే పలు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు నర్సింగారావు ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు అశోక్, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి స్వామి, గ్రామ నాయకులు గాల్ రెడ్డి, సాయి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.