
శ్రీ రఘునాథ ఆలయ చారిటబుల్ ట్రస్ట్ ప్రత్యేక సమావేశం ఆదివారం ఖిల్లా రామ మందిర్ యందు శ్రీ ముక్క దేవేందర్ గుప్తా చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంతవరకు ట్రస్ట్ ద్వారా జమ కర్చులు వివరములను ఆడిటర్ ద్వారా చేయించి సభ యందు సమర్పించినారు. సభ్యులు ఆమోదం తెలిపినారు. శ్రీ రఘునాథ ఆలయం చారిటబుల్ ట్రస్ట్ శాశ్వత సభ్యుల వివరాలు, ఆలయ చరిత్ర ,పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, అన్నదాన కమిటీ ,మొదలైన వాటిపై ఒక కరదీపిక వెలువరించుటకు తెలియజేయడమైనది. శ్రీ ముక్క దేవేందర్ గుప్తా ఆలయ కమిటీ చైర్మన్ పదవీకాలంలో నిర్వహించిన అన్ని కార్యక్రమాల గురించి తెలియపరిచినారు మరియు ఈ కాలంలో వారికి సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞత, అభివందనాలు, తెలిపినారు. ఆలయం నిర్వహణలో లోటుపాట్లను సరిచేసి ఇంకా సమర్థవంతంగా నిర్వహించుటకు ట్రస్ట్ సభ్యులు తమ సూచనలు సలహాలు అందజేసినారు. ఈనాటి కార్యక్రమంలో గురు ప్రసాద్, కొండ వీరశేఖర్ గుప్తా, రాజేంద్ర ప్రసాద్ , గంట లింగం, అంబాదాసురావు, పెండ్యాల శ్రీనివాస్ గుప్తా, అశోక్, తాటి వీరేశం, చల్ల గంగాధర్, జి రాజశేఖర్ గుప్తా, భూమ లింగం గుప్త, వి. నారాయణ గారు శ్రీ బచ్చు సంతోష్, పడగల నాగనాథ్ గుప్తా, శంకర్ తదితరులు 50 మంది ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ముక్కా దేవేందర్ గుప్తా తన పదవీకాలంలో నిర్వహించిన లెక్కలను కమిటీకి అప్పగించినారు. నూతనంగా శ్రీ రఘునాథ ఆలయ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా చెరువుపల్లిగురు ప్రసాద్ టాక్స్ కన్సల్టెంట్ ని ఏకగ్రీవంగా అందరి ఆమోదంతో ఎన్నుకొనబడినారు. అదేవిధంగా ట్రస్ట్ సభ్యులందరూ ధన్పాల్ సూర్యనారాయణ గుప్త నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ని గౌరవాధ్యక్షులుగా అంగీకరించుటకు కోరినారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ చెరువుపల్లిగురు ప్రసాద్ తాను అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపినారు. త్వరలోనే నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకొని పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపినారు. పదవి విరమణ గామించిన చైర్మన్ శ్రీ ముక్క దేవేందర్ గుప్త కి నూతన చైర్మన్ శ్రీ చెరువుపల్లిగురు ప్రసాద్ కి ట్రస్టు సభ్యులు ఘనంగా సన్మానించినారు. దేవాలయ రోజువారీ కార్యక్రమాల నిర్వాహణలో సహకరిస్తున్న పూజారి ని పోశెట్టి అభినందించారు.