ఓటర్ లిస్ట్ ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ పై ప్రత్యేక సమావేశం..

Special meeting on draft publication of voter lists.నవతెలంగాణ – రెంజల్

రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గత వారం రోజులుగా గ్రామ కార్యదర్శులు ఓటర్ జాబితాలోని చేర్పులు మార్పులు పూర్తి చేయడం జరిగింది అని, ఓటర్ లిస్ట్ డ్రాప్ పబ్లికేషన్ కోసం సిద్ధం కావాలని ఎంపీడీవో వెంకటేష్ జాదవ్, పాలనాధికారి హెచ్ శ్రీనివాస్, రఫీ హైమద్ లు గ్రామ కార్యదర్శులకు సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో గణేష్ నిమర్జనోత్సం పురస్కరించుకొని ప్రతి గ్రామ పంచాయితీ కార్యదర్శులు తమ గ్రామంలోని ఏర్పాట్లను చేయాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు పరిసరాల పరిశుభ్రత ఫాగింగ్ ప్రతి గ్రామంలో సాయంత్రం చేయాలన్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా గ్రామ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు రాజేందర్ రావు, శ్రీకాంత్, మహబూబ్ అలీ, రాఘవేందర్ గౌడ్, సిహెచ్ సాయిలు, నవీన్, రాణి, శీభ, సునీల్ యాదవ్, శివ కృష్ణ, సలాం, రాజు, వెంకటరమణ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.