విద్యార్థుల ప్రగతిపై ప్రత్యేక సమావేశం

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాలలో శనివారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించిన ఉపాధ్యాయులు ఈ సమావేశంలో పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతి గురించి చర్చించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రార్థనకే హాజరై స్వయంగా విద్యార్థులే ప్రార్థన చేయించడం చూసి వారిని అభినందించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థుల ప్రగతి ప్రదర్శన చేయడం జరిగింది. ఉపాధ్యాయులు బాలమణి, శ్రీనివాసులు, వెంకటేష్, పద్మావతి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు బట్టి విధానంలో కాకుండా భోధనోపకరణాలను ఉపయోగించి అర్థవంతంగా త్యాదార భోధన చేస్తున్నామని, ఇంకా పాఠశాలలో చేపడుతున్న స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, వినూత్న కార్యక్రమాలను వివరించారు. పరీక్షలు దగ్గర వస్తున్న సందర్భంలో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోని ఇంటి వద్ద వారు చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథితులుగా హాజరైన గ్రామ పెద్దలు పాత్కుల రామచంద్రయ్య పాఠశాలలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి మొదటి, ద్వితీయ బహుమతులుగా నాలుగు వేల రూపాయల నగదు బహుమతిని ఇస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పరమేష్, బాల్ నారాయణ, బలరాం, లక్ష్మయ్య, శ్రీను, శివశంకర్, మహేష్, నిరంజన్, మంజుల, సునీత, వసంత, రేణుక, రాము, చెన్నమ్మ, అనిత, అఖిల, మల్లమ్మ, యువకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.