నవతెలంగాణ రెంజల్: రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామాల అభివృద్ధి యాక్షన్ ప్లాన్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీవో శంకర్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్ పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతి గ్రామంలోని గ్రామ అభివృద్ధి పై యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని వారు సూచించారు. పంచాయతీకి సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శులు రాజేందర్రావు, శ్రీకాంత్, మహబూబ్ అలీ, సిహెచ్ సాయి, నవిన్, సుమన్, రాజు, శివ కృష్ణ, రోజా, రాణి, గిరి, అమ్రిన్ ,రజిత తదితరులు పాల్గొన్నారు.