నవతెలంగాణ- రెంజల్
మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఆన్లైన్ నమోదు కార్యక్రమం లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆన్లైన్ నమోదు కార్యక్రమాలను వేగవంతం చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. 17 గ్రామ పంచాయతీల పరిధిలో వచ్చిన వినతి పత్రాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. ఈనెల 17 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ నమోదు కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించే రాదని ఆయన అన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శంకర్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, సూపరిండెంట్ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శులు రాజేందర్ రావ్, రాఘవేందర్ గౌడ్, 17 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కార్యదర్శులు పాల్గొన్నారు.