నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం రోజున మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవ్ అధ్యక్షతన మండల స్థాయి అధికారుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమం గురించి దిశా నిర్దేశం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కాబట్టి ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది .కాబట్టి కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా గ్రామాల్లో అవగాహన కల్పించుట కొరకు ప్రజలందరికీ తెలియజేయాలని ఆయన తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఒకే దరఖాస్తు నింపి గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో సమర్పించవలసి ఉంటుందని అలాగే అధికారులకు ఇట్టి కార్యక్రమం గురించి సూచనలు చేస్తూ ఇచ్చిన షెడ్యూలు ప్రకారంగా గ్రామసభలు నిర్వహించి ఏర్పాటు చేసిన కౌంటర్లలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కౌంటర్లలో త్రాగునీటి వసతి టెంట్ ఏర్పాటుచేసి గ్రామస్థాయిలలో విస్తృత ప్రచారం కల్పించాలని ప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లింగం నాయక్, తాసిల్దార్ కుతుబుద్దీన్, డిప్యూటీ తాసిల్దార్ మునిరుద్దీన్, ఎంపిఓ ఇక్బాల్, ఈవో రవీందర్, ఏ ఈ పంచాయతీరాజ్ స్రవంతి, మరియు గ్రామ పంచాయతీ సెక్రెటరీలు, ఉపాధి హామీ సిబ్బంది హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు.