నవతెలంగాణ – రెంజల్
పెంజర్ మండలం బాగేపల్లి గ్రామంలో బుధవారం ఇంటి పన్నుల వసూళ్ల కోసం గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ సిబ్బందితో వెళ్లి పన్నులు వసూలు చేశారు. గ్రామంలోని ప్రతి కుటుంబం ఇంటి పన్నులను, కులాయి పన్నులను చెల్లించి గ్రామం అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట గ్రామ కార్యదర్శి జాజు శ్రీకాంత్, కారోబార్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.