నవతెలంగాణ – మోపాల్
శనివారం రోజు మోపాల్ మండల కేంద్రంలో వేసవికాలంలో తాగునీటి సమస్య నివారించుటకు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్, మోపాల్ మండల్ స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్ స్థానిక మండలాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోపాల్ మండలంలో 21 గ్రామపంచాయతీలను నాలుగు క్లస్టర్ గా విభజించి అందులో ఏ ఒక్క గ్రామానికి నీటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లింగం నాయక్, మండల తాసిల్దార్, ఎం పి ఓ ఇక్బాల్, మండల వ్యవసాయ అధికారి రవీందర్, మిషన్ భగీరథ ఈ వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.