కులగణనను పరిశీలించిన ప్రత్యేక అధికారి..

Special Officer who examined the census.నవతెలంగాణ – పెద్దవూర
మండలంలో చేపడుతున్న కులగణనను బుధవారం బసిరెడ్డిపల్లి గ్రామంలో మండల ప్రత్యేక అధికారి రాజ్ కుమార్, ఏంపీడీఓ ఉమాదేవీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. సామాజిక వర్గాల వారీగా కులగణన చేసి సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం కుల గణన సర్వే ప్రారంభించిందని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు సిబ్బందికి సహకరించాలని తెలిపారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.