
– మేజర్ పంచాయతీలకు గెజిటెడ్ అధికారుల నియామకం
నవతెలంగాణ -పెద్దవూర
సర్పంచుల పాలన జనవరి 30 తో ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనకు శ్రీకారం చుట్టారు. ఇందుకు గాను పెదవూర మండలం లో 26 గ్రామ పంచాయతీలకు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు,మండల పరిషత్, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్, ఉపాధి హామీ, వ్యవసాయ, మిషన్ భగీరథ,శాఖల్లో పనిచేస్తున్న అధికారులను నియమించారు.అయితే మేజర్ గ్రామ పంచాయతీల్లో గెజిటెడ్ అధికారులైన ఎంపీడీవోలు, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ లు, ఎంపీ ఓలు, మండల వ్యవసాయ అధికారులు,పంచాయతీరాజ్, ఇరిగేషన్, మిషన్ భగీరథ ఏఈలు, ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. కాగా చిన్న గ్రామపంచాయతీల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, ఉపాధి హామీ, ఐకేపీ, ఏఈవోలు, తదితర శాఖల ఉద్యోగులు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. వీరు సర్పంచుల స్థానాల్లో ప్రత్యేక అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారుప్రభుత్వం గ్రామాల్లో పాలన కొరకు ప్రత్యేక అధికారులను జిల్లా క్షలెక్టర్ హరిచందనఆదేశాల ప్రకారం మండల ప్రత్యేక అధికారులను నియమించింది. మండలం లో మొత్తం 26 పంచాయతీ లకు గాను 09 సెక్టర్లు గా విభజనచేసి 9 మంది ప్రత్యేక అధికారులను ఏర్పాటుచేశారు. సెక్టర్ 1.బట్టుగూడెం, పెద్దవూర, పినవూర పంచాయతీ లకు ఎంపిఓ కూన్ రెడ్డి విజయకుమారి,సెక్టర్ 2.బసిరెడ్డిపల్లి,గర్నెకుంట,వెల్మగూడెం పంచాయతీ లకు ఎంపీడిఓ లక్ష్మి, సెక్టర్ 3.పోతునూరు, పులిచర్ల పంచాయతీలకు తహసీల్దార్ సరోజ పావని,సెక్టర్ 4.తుంగతుర్తి, పొట్టేవానితాండ,నాయినవాని కుంటతాండా పంచాయతీ లకు ఏఈ రామకృష్ణ, సెక్టర్ 5.లింగంపల్లి,తెప్పమడుగు,చింతపల్లి పంచాయతీలకు సూపరిండెంట్ హఫీజ్ ఖాన్,సెక్టర్ 6.కుంకుడుచెట్టు తండా, నీమానాయక్ తండ పంచాయతీ లకు ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ దీక్షిత్కుమార్,సెక్టర్ 7.జయరాం తండా పర్వేదుల, పాల్తీ తండా పంచాయతీ లకు మల్లయ్య,సెక్టర్ 8.కోమటి కుంట తండ,ఉట్లపల్లి, గేమ్యానాయక్ తండపంచాయతీ లకు మండలం వ్యవసాయాదికారి సందీప్ రెడ్డి,సెక్టర్ 9 శిరసనగండ్ల, పెద్దగూడెం గ్రామ పంచాయతీ లకు ఎంఎస్ఓ సాలయ్య ను నియమించారు. వీరు శుక్రవారం నుంచి మండల ప్రత్యేక అధికారులగా బాధ్యతలు తీసుకున్నారు.