ప్రత్యేక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

– ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లకు త్రాగునీరుకు ప్రాధాన్యత ఇవ్వాలి
– జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ

 నవతెలంగాణ – అచ్చంపేట
గ్రామ పంచాయతీలలో సర్పంచుల పదవీకాలం ముగిసది. అన్ని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారానికి చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలను టాయిలెట్లు,  త్రాగునీరుకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఉపాధి చట్టం ప్రకారం కూలీలకు 15 రోజులకు డబ్బులు చెల్లించాలని నిబంధనలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదని అన్నారు. మన ఊరు మనబడి ప్రణాళికలో వచ్చిన నిధులు ఖర్చైన నిధులు వివరాలను మండల విద్యాశాఖ అధికారి అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యత మైన కరెంట్ నువ్వు సరఫరా చేయాలని సూచించారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేయకపోతే వారికి నోటీసులు ఇచ్చి ఇతరులకు పనులు చేసే అవకాశం కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు , వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని గుర్తు చేశారు. అనంతరం సర్పంచుల కాలం ఐదేళ్లు ముగియడంతో అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్ లనుశాలువాతో సన్మానించారు.సమావేశంలో ఎంపీపీ శాంతాబాయి, ఎంపీడీవో సుదర్శన్ గౌడ్,  ఎంపీ ఓ వెంకటేశ్వర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.