సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక ప్యాకేజీ

Special package for senior citizens– ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ వెల్లడి
హైదరాబాద్‌ : సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రత్యేక ప్యాకేజీని పరిచయం చేసినట్టు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ తెలిపింది. ఇందులో అనుకూల మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌, కాంప్లిమెంటరీ హెల్త్‌కేర్‌ ప్రయోజనాలు, సైబర్‌ ఇన్సూరెన్స్‌తో సహా పలు ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది. తమ మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లో ‘సీనియర్‌ సిటిజన్‌ స్పెషల్స్‌’ అనే ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్టు తెలిపింది. ఇందులో అనేక ప్రయోజనాలను పొందుపర్చామని ఆ బ్యాంక్‌ వెల్లడించింది.