రైతు బంధు పథకం పై సోమవారం రోజు నాగిరెడ్డిపేట మండలంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతులతో ప్రత్యేక సర్వసభ్య సమావేశం మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట మండలంలో రెండు సొసైటీల పరిధిలో ఈ సమావేశం నిర్వహించారు. మాల్ తుమ్మెద సొసైటీ పరిధిలో గల రైతులకు నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో సమావేశం నిర్వహించి రైతుబంధుపై అభిప్రాయ సేకరణ నిర్వహించారు. అదేవిధంగా తాండూర్ సోసైటీ ఆధ్వర్యంలో తాండూరు గ్రామంలో గల సొసైటీలో తాండూర్ పరిధి రైతుల అభిప్రాయ సేకరణ నిర్వహించారు. రైతుబంధు పై రైతుల ద్వారా స్వీకరించిన అభిప్రాయలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ టేకులపల్లి వినీత, సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణవేణి, మీద్దె బాబు, జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, ఏ డి ఏ వీరస్వామి, మాజీ చైర్మన్ రాజిరెడ్డి, ఏ వో విజయ శేఖర్ తో పాటు ఆయా సొసైటీల డైరెక్టర్లు వాసు రెడ్డి, యాదయ్య, రామకృష్ణ, సి ఇ ఓ పవన్, జైపాల్ రెడ్డి, ఏయ్ నికిత, భబితలు పాల్గొన్నారు.