సంక్రాంతిని పురస్కరించుకొని జొన్న చేనుల్లో ప్రత్యేక పూజలు

– భోగి సంక్రాంతి కనుమ పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్న మండల ప్రజలు,

– జొన్న చేనుల్లో ప్రత్యేక పూజలు ఇంటికి తీసుకు వచ్చిన లక్ష్మి దీపం,
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల ప్రజలు భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల మూడు రకాల పండుగలను సంప్రదాయ బద్దంగా భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి రోజున ప్రజలు తమ తమ చేనుల్లోకి వెళ్లి జొన్న పంటకు ప్రత్యేకంగా పూజలు చేసి జొన్న చేనుల్లో వెలిగించిన దీపాన్ని లక్ష్మి దీపంగా భావిస్తూ ఇండ్లకు తీసుకువచ్చారు. సంక్రాంతి సంబరాల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు బంధుమిత్రులు పాల్గొన్నారు. మూడు రోజులు జరుపుకునే భోగి సంక్రాంతి కనుమ పండుగలను మద్నూర్ ఉమ్మడి మండల ప్రజలు ఆనందంగా ఉత్సాహంగా ఘనంగా జరుపుకున్నారు.