శ్రీదర్ బాబు భారీ మెజార్టీతో గెలువాలని ప్రత్యేక పూజలు

నవతెలంగాణ- మల్హర్ రావు: జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టో చైర్మన్, మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మంథని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలువాలని మంగళవారం మండలంలో కొండంపేట గ్రామంలోని శ్రీఆంజనేయ దేవాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోమండల మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులురాలు కొండ రాజమ్మ, కొండంపేట ఎంపీటీసీ సభ్యురాలు ఏనుగు నాగరాణి లక్ష్మి నారాయణ, గ్రామ శాఖ అధ్యక్షుడు శెనిగరం శ్రీకాంత్, యూత్ నాయకులు శెనిగరం సంతోష్, శెనిగరం రమేష్, నాయకులు రాజేశ్వర్ రావు, ఇరుకు పోచయ్య, కొడారి చినమ్మళ్ళు, పోటు ప్రభాకర్ రెడ్డి, శెనిగరం రాజయ్య, కొలకాని సమ్మయ్య, కొలకాని  సారయ్య, లక్ష్మణ్, జేకు ముత్తయ్య, ఏనుగు తిరుపతి, తోడే  కేశవ రెడ్డి, శెనిగరం వెంకటయ్య పాల్గొన్నారు.