నవతెలంగాణ – ఆర్మూర్
సుప్రసిద్ధ దేవస్థానం సిద్దులగుట్ట వద్ద నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రంలో ఆనంద ఆదివార కార్యక్రమం నిర్వహించినారు. కార్యక్రమానికి జ్ఞానదాతగా ఆంధ్ర ప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుండి విచ్చేసి అద్భుతమైన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవులు ఈర్ష,ద్వేషము అసూయ, కుట్ర లు అన్ని విడిచి పెట్టాలని నిర్మలమైన హృదయంతో నిర్మలమైన మనసుతో ధ్యానం చేసి జ్ఞానం పొందాలన్నారు. మానవ జీవితంలో ధ్యానం తప్పకుండా చేయాలని సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్నారు. సుప్రసిద్ధ దేవస్థానం సిద్దుల గుట్టను సందర్శించడం ఎంతో ఆనందంగా, ఉందని జిల్లాకు మొట్టమొదటిసారి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని శివాలయం, రామాలయం ఎంతో అద్భుతంగా ఉందని సిద్దులగుట్ట ప్రపంచానికే ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ ఎం జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, సిద్దేశ్వర పిరమిడ్ చైర్మన్ తిరుమల గంగారం, బద్దం దేవేందర్, నాగేల్లి గంగారెడ్డి, లింగారెడ్డి, సత్యనారాయణ, రాజు, అంకాపూర్ ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.