నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ స్కాలర్స్ పాఠశాల యందు విద్యార్థులకు చదువుతూ పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పాఠశాల కరస్పాండెంట్ తాళ్ల వేణు, ప్రిన్సిపాల్ గుమ్మాల ఓడ్డెన్న లు గురువారం తెలిపారు. ఇంగ్లీష్, గణితం సైన్సు ఇతర సబ్జెక్టులలో నైపుణ్యం లేని వారిని గుర్తించి, వారికి వైస్ ప్రిన్సిపాల్ సహస్ర, ఉపాధ్యాయ బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. చదువుతూ పాటు వ్యాయామం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నట్టు తెలిపారు.